‘కన్నప్ప’ చిత్రీకరణలో ప్రభాస్

10-05-2024 12:05:00 AM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. భారతీయ చిత్ర పరిశ్రమల్లోని పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో కనపడనున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్ వంటి వారు ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయగా, తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించనున్నామని తెలిపారు చిత్ర నిర్మాతలు. భారీ హంగులతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి ప్రఖ్యాత హాలీవుడ్ ఛాయాగ్రహకుడు షెల్డన్ చౌ, యాక్షన్ డైరక్టర్ కెచా వంటి సాంకేతిక వర్గం పనిచేస్తున్నారు.