14 July, 2026 | 4:50 AM

ఏసీబీ వలలో కమలాపూర్ తహసీల్దార్

20-05-2024 06:15 PM

 హన్మకొండ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రైతు దగ్గర లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ప్రస్తుతం కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం మాధవి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం నాడు  5,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.