29 June, 2026 | 6:23 PM

ప్రజ్ఞానంద పరాజయం

08-06-2024 12:47 AM

స్టావెంజర్ (నార్వే): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నమెంట్‌లో ఓటమి పాలయ్యాడు. శుక్రవారం తొమ్మిదో రౌండ్‌లో ప్రజ్ఞానంద అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరునా చేతిలో పరాజయం చవిచూశాడు. క్లాసికల్ గేమ్‌ను డ్రాగా ముగించినప్పటికీ ఆర్మ్‌గెడాన్‌లో కరూనాకు తలవంచాడు.13 పాయింట్లు ఖాతాలో ఉన్న ప్రజ్ఞానంద 9 రౌండ్లు ముగిసేసరికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. స్థానిక ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ ఫిరౌజా అలీరెజాను ఆర్మ్‌గెడాన్ పోరులో ఓడించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లారెన్ చేతిలో ఓటమి చవిచూసిన హికారు నకామురా (అమెరికా) 14.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ఆర్.వైశాలీలకు 9వ రౌండ్‌లో ఓటములు ఎదురయ్యాయి. చైనా గ్రాండ్ మాస్టర్ టింగ్‌జీ లీ చేతిలో వైశాలీ.. చైనా గ్రాండ్‌మాస్టర్ వెన్‌జున్ జు చేతిలో హంపి పరాజయం పాలయ్యారు.