1 May, 2026 | 4:43 PM

ప్రజా పాలన ప్రణాళిక విజయవంతం కోసమే 2 కె రన్....

10-03-2026 02:11 PM

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రణాళిక(Praja Palana – Pragathi Pranalika) విజయవంతం చేసేందుకు గాను 2 కె రన్  నిర్వహించడం జరిగిందని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్(Sultanabad Municipal Chairman) బిరుదు రాధాకృష్ణ అన్నారు, మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు టు కె రన్ నిర్వహించడం జరిగింది, ఇందులో పాల్గొన్న వారికి టీ షర్ట్ లు క్యాప్ లు అందజేశారు.

ఈ సందర్భంగా బిరుదు కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక విజయవంతం చేసేందుకు గాను అందరూ సహకరించాలని అన్నారు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ ,  వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, స్థానిక సీఐ సుబ్బారెడ్డి,  ఎస్ఐ చంద్రకుమార్, మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ , వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ మంద శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ క్లబ్బు  అధ్యక్షులు ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, వాకర్స్ , ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,