మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి
10-03-2026 02:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీఐ కృష్ణ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. గ్రామాల్లో మాదకద్రవ్యాలు వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లింబాద్రి, హెచ్ఎం నర్సయ్య, అడ్డా యూత్ అధ్యక్షులు నాగరాజ్, ప్రేమ్ కుమార్, సాయన్న, ప్రభాకర్, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.






