గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలి
10-03-2026 02:08 PM
మైనంపల్లి కొర్ర తండా సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ నాయక్
దేవరకొండ, విజయక్రాంతి: గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలి మైనంపల్లి కొర్ర తండా సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ నాయక్ అన్నారు. దేవరకొండ మండలంలో మైనంపల్లి గ్రామంలో సోమవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో బాగంగా డ్రైనేజీలను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ వేయించారు. గ్రామంలో చెత్తను రోడ్డుపై వేయమని. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాము అని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలూ నాయక్.వార్డు సభ్యులు సునీత బద్దు. కిషన్ నాయక్.సంతు వెంకట్.స్నేహ వినోద్.పంచాయతీ కార్యదర్శి అంబెడ్కర్. ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి. జగదీష్. అంగన్వాడీ టీచర్ కమలమ్మ. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు






