2 April, 2026 | 3:15 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి

02-04-2026 01:35 PM

15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామ అభివృద్ధికి చర్యలు

కల్వచర్ల గ్రామ సభలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగిరి,(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని అన్నారు.   

99 రోజుల స్పెషల్ ప్రోగ్రాం క్రింద పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్యశాఖ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్డు భద్రత పై అవగాహన, వ్యవసాయం , మహిళా సంక్షేమం వంటి వివిధ రంగాలపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేడు గ్రామ సభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ప్రజల నుంచి వచ్చే  అభిప్రాయాల ను ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని,

గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై  సలహాలు అందించాలని అన్నారు. డిసెంబర్ నెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసి పాలక వర్గాలు ఏర్పడ్డాయని, 15 వ ఆర్థిక సంఘం సంబంధించి పెండింగ్ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని, గ్రామాల వద్ద అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ అవసరాల మేరకు చేపట్టాలని, గ్రామ సభ కార్యక్రమంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనే అంశం పై చర్చించాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.