2 April, 2026 | 3:16 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

02-04-2026 01:30 PM

మంథని,(విజయక్రాంతి): మంథనిలో సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.  రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్  ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని చరిత్ర నిర్మాణంలో తనదైన చెరగని పాత్రను నిర్వర్తించిన ఒక మహాయోధుడు తెలంగాణ గడ్డపై జన్మించాడనీ. అతడే సర్దార్ సర్వాయి పాపన్న. పీడిత ప్రజలకు రక్షకుడిగా నిలిచి దళిత, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిసారిగా నిరూపించాడు. దాదాపు 350 ఏండ్ల క్రితమే కుల, మత, జాతివర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు, గొప్ప సామాజిక బహుజనవిప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న.

ఆధిపత్య అగ్రకుల పాలకులు బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలో స్వీయ సైన్యంతో దక్కన్పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు, మహాత్మా జ్యోతిబా ఫూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జమీందార్లు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో  గౌడ కులస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.