2 April, 2026 | 5:23 PM

ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు

02-04-2026 03:49 PM

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యం తోని సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో గ్రామ సభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గ్రామానికి మంజూరైన పథకాలను గ్రామ సర్పంచ్ షేక్ సలెహ సుల్తానా ఆధ్వర్యంలో వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చలు జరపడం లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాల నిర్ణయించడం ప్రధాన ఉద్దేశం అన్నారు. రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి 200 యూనిట్ల  వరకు ఉచిత విద్యుత్, వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తాసిల్దార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.