2 May, 2026 | 9:19 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల ప్రతిష్ట అమలు కోసం ప్రజాపాలన

02-05-2026 07:40 PM

డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, అర్హులైన పేదలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని, 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ కోరారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా డోర్నకల్  నియోజకవర్గస్థాయి సమావేశం అదనపు కలెక్టర్ పురుషోత్తం అధ్యక్షతన మరిపెడ లో భార్గవ ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు రెండవ విడత సాంక్షన్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని సరిత, జిల్లా కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్, డిపిఓ హరిప్రసాద్, మరిపెడ డోర్నకల్ మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, వైన్స్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులు, వివిధ మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.