7 June, 2026 | 4:35 AM

ఆరోగ్య రంగానికి ఊతం..

02-05-2026 07:37 PM

భిక్కనూరులో అభివృద్ధి దిశగా అడుగులు

భిక్కనూర్,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోగ్య రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినట్లు, భిక్కనూర్ పీహెచ్‌సీని కూడా అదే స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహప్రవేశం చేసిన గొల్ల రమేష్ ఇంటిని సందర్శించి బట్టలు అందజేశారు.