12 May, 2026 | 1:23 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

12-05-2026 12:00 AM

కలెక్టర్ కె హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమములో వచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రజావాణిలో అందిన దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం దరఖాస్తు దారుల నుండి అర్జీలు స్వీకరించారు కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామానికి చెందిన రౌతు మనీషా తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు దహెగాం మండలం బోర్లకుంటా గ్రామానికి చెందిన జుమ్మిడి శంకరమ్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు గురించి దరఖాస్తు సమర్పించారు.

జిల్లా కేంద్రాములోని బజార్ వాడికి చెందిన వేముల మంజుల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరి గురించి ధరఖాస్తు వాంకిడి మండలం వెల్గి గ్రామానికి చెందిన జుగ్నక బాదిరావు తనకు జీవనోపాధి కోసం ఆర్థిక చేయూత అందించగలరని దరఖాస్తు ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన లోహట్ పరాస్ తనకు ఉన్నత చదువుల కొరకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని దరఖాస్తు సమర్పించారు సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కార్ సోర్పే అంజి తనకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని దరఖాస్తు సమర్పించారు. జిల్లా కేంద్రంలోని పైకాజి నగర్ కాలనీకి చెందిన పలువురు తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.ఈ ప్రజావాణి కార్యక్రమములో జిల్లా అధికారులు, ఆర్జిదారులు పాల్గొన్నారు.