5 May, 2026 | 4:13 AM

కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో ‘ప్రజావాణి’లో 13 ఫిర్యాదుల నమోదు

05-05-2026 02:22 AM

కందుకూరు మే 4 (విజయక్రాంతి): రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ప్రజావాణి అధికారి రాకేష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తం 13 ఫిర్యాదులు అందగా, వాటిని వెంటనే పోర్టల్లో నమోదు చేశారు.

కందుకూరు తహసీల్దార్ కార్యాలయం సంబందించి 05, కందుకూరు ఎంపీడీవో కార్యాలయం 03, ఆర్డీవో కార్యాలయం 01, మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయం 01, కడ్తాల్ ఎంపీడీవో కార్యాలయం 01, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ 01, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 01 ఫిర్యాదులు అందాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా అధికారులను కలిసేందుకు ఇది మంచి అవకాశమని, అందిన ఫిర్యాదులను తదుపరి చర్యల కోసం సంబంధిత విభాగాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.