5 May, 2026 | 3:36 AM

రైతు వారోత్సవం ప్రారంభం

05-05-2026 02:21 AM

మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా మేడ్చల్ జిల్లా లో రైతు వారోత్సవాన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి ఈనెల తొమ్మిదో తేదీ వరకు రైతు వారోత్సవం జరగనుంది. అందులో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని రైతు వేదికల లెవల్లో వ్యవసాయానికి సంబందించిన కార్యక్రమాలు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి, కే. చంద్రకళ తెలిపారు.

సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ దాని ప్రాముఖ్యత, సాయిల్ శాంపిల్ కలెక్షన్ డెమోన్స్ట్రేషన్, సాయిల్ హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్, వాటి అధారంగా ఎరువుల వాడకం, సమగ్ర ఫర్టిలైజర్ యాజమాన్యం పైన రైతులకు అవగాహన, నానో యూరియా ప్రమోషన్, నేచురల్ ఫార్మింగ్, ఫార్మ్ మెకనైజేషన్, వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగు పై రైతులకు వివరంగా వివరించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి కే. చంద్రకళ తెలిపారు.