రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 89 దరఖాస్తులు
సమస్యల పరిష్కారానికి అదనపు కలెక్టర్ ఆదేశం
రంగారెడ్డి, మే 4(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ’ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 89 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డికి విన్నవించుకు న్నారు. మొత్తం 89 దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించి 24, ఇతర శాఖలకు సంబంధించి 65 అర్జీలు వచ్చాయి.ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పెండింగ్లో పెట్టకుండా, వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ నెల 4 నుండి ప్రారంభమైన రైతు వారోత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి అధికారులకు సూచించారు. జనాభా గణన-2027పై స జనాభా గణనలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని అధికారులు కోరారు.వ్బుసైట్: se.census.gov.in పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అవకాశం ఉంది.ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ’సెల్ఫ్ డిక్లరేషన్ ఐడి’ పొందాలని, సర్వే కోసం సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని వారికి చూపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో పాటు వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.






