తాడ్వాయిలో ప్రజావాణి
14-04-2026 01:51 AM
తాడ్వాయి, ఏప్రిల్, 13( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావలసి ఉన్న కొన్ని శాఖల అధికారులు మాత్రమే హాజరవుతున్నారు.
మిగతా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు.. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్తే ప్రజావాణిలో సంబంధించిన అధికారులు ఉండడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




