రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు!
- మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది
- ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 30 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.
యూపీఏ హయాంలో సోనియా గాంధీ మహిళా చైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ, కూటమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మహిళా సాధికారతపై, మహిళా రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లకు, నియోజకవ ర్గాల పునర్విభజనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డికి చ ట్టంపై కనీస అవగాహన లేద ని ఎద్దేవా చేశారు.
2026 జనాభా లెక్కల తర్వా తే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని 2013 లో చట్టం చేశారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీల పార్లమెంట్ సీట్ల సంఖ్య 84 నుంచి 105 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. అసెంబ్లీలో కూడా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరుగుతాయ న్నారు.
వారి ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజ న వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రేవంత్‌రెడ్డి అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత సీట్ల నిష్పత్తి తగ్గకుండానే సీట్లను పెంచుతామని ప్రధాని మోదీ ఇప్పటికే భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.




