విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచాలి
01-09-2026 12:17 AM
మంచిర్యాల, ఆగస్టు 31 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), డీఈఓ పి. చందయ్యతో కలిసి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విద్యార్థుల హాజరు, అభ్యాసన సామర్థ్యంపై వారాంతపు నివేదికలు సేకరించేలా యాప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.






