calender_icon.png 9 September, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రణయ్

09-09-2025 12:00:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఆల్ ఇండి యా సివిల్ సర్వీస్ ఉద్యోగుల జిల్లా స్థాయి చదరంగం పోటీలో ఇనుగుర్తి మండల జిల్లా పరిషత్  పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్ విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి జ్యోతి తెలి పారు.

ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వ హించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ్ పాల్గొంటారని ఆమె తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపి కైన ప్రణయ్ ని ఇనుగుర్తి పాఠశాల హెడ్మాస్టర్ రూప రాణి, సహ చర ఉపాధ్యాయులు అభినందించారు.