calender_icon.png 10 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చెరలో సర్కారు భూమి!

09-09-2025 12:00:00 AM

  1. కాపాడాలంటూ వినతులు

చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్

దుర్గానగర్లో పార్కుకు స్థలం కేటాయించాలి

అమీన్ పూర్, సెప్టెంబర్ 8 :ఖాళీగా కనిపించే ప్రభుత్వ భూములను అప్పనంగా కా జేయడానికి కొందరు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారు. కొందరు అధికారులు సైతం వారికి వత్తాసు పలకడంతో కాలనీవాసులు ఏకతాటిపై ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. పటాన్ చెరు నియోజవర్గం అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేటలోని రెయి న్బో మెడోస్ కాలనీలో సర్వే నంబర్ 208, 210లో ఉన్న ఎకరం ఆరు గుంటల ప్రభుత్వ భూమి ఉంది. కొందరు భూ కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వ భూ మిని కాజేయాలని చూస్తున్నారు.

ఇందుకు పక్క సర్వే నంబరు వేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణమే ప్రభుత్వ భూమిని భూకబ్జా దారుల నుండి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. కిష్ణారెడ్డిపేట దుర్గా నగర్ కాలనీ వాసుల కోరిక మేరకు గత కలెక్టర్ గ్రా మంలో గల సర్వే నంబర్ 164 లో ప్రభుత్వ భూమిని దుర్గా నగర్ కాలనీకి పక్కనే ఉన్నందున ఆ స్థలాన్ని పార్కు కొరకు 30 గుంటల భూమిని సర్వే చేయించారు.

అమీన్ పూర్ తహసిల్దార్ వెంకటస్వామి వీరికి పార్కు ఇక్క డ ఇవ్వవచ్చని సర్వే చేసి రిపోర్ట్ తయారుచేసి సంగారెడ్డి ఆర్డీవోకు లెటర్ పెట్టడం జరిగింది. దానిని కూడా వెంటనే మంజూరు చే యించి దుర్గా నగర్ కాలనీ ప్రజలకు ఇప్పించాలని కోరుతూ అమీన్ పూర్ బిజెపి మం డల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ అధ్వర్యంలో కిష్టారెడ్డిపేట్ రెయిన్బో మెడల్స్ కాలనీ ప్రజలతో, దుర్గా నగర్ కాలనీ ప్రజలతో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి కి వినతి ప త్రం సమర్పించారు. 

కబ్జాదారులపై చర్యలు తీసుకోండి...ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కిష్టారెడ్డిపేటలోని సర్వే నంబర్ 208, 210 సర్వే నంబర్లో ఉన్న ఎకరం ఆరు గుం టల భూమిని కబ్జాదారుల చెరనుండి కాపాడాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులకు ఆదేశించారు. నివాసుల చట్టబద్ధ హక్కులను రక్షించి తగిన చర్యలు చేపట్టాలని ఫోన్ లో ఆదేశాలు జారీ చేశారు. స్థానికులకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమీన్ పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ఈ యొక్క సమస్యను తొందరగా అమీన్ పూర్ రెవెన్యూ ఉన్నత అధికారులు స్పందిం చి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.

లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అదేవిధంగా సోమవారం సంగారెడ్డి ప్రజావాణి లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి కాలనీ ప్రజలు తమ గోడు చెప్పుకోవడం జరిగిందన్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్డిఓ కి, అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి కి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నా రు.

దుర్గా నగర్ పార్కు గురించి మరొకసారి సర్వే చేసి రిపోర్టు పంపాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మం డల ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గౌడ్. అమీన్ పూర్ బిజెపి మండల ఉపాధ్యక్షులు రాజేందర్ గౌడ్. శ్రీధర్ రెడ్డి.మండల యువమోర్చా అధ్యక్షులు ముత్యాల వెంకటేష్. నా యకులు సముద్రాల రాకేష్ లోటస్ రాకేష్. రెయిన్బో మెడోస్ కాలనీ అధ్యక్షులు వారి కార్యవర్గం సభ్యులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.