16 April, 2026 | 8:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రణీత్ రావు

13-06-2025 03:27 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు(Praneeth Rao) సిట్ ముందు విచారణకు(Special Investigation Team) హాజరయ్యారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. గతంలోనే ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించింది. మాజీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావు(Prabhakar Rao) చెబితేనే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case), హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. 

ఎస్ఐబీలో పనిచేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Deputy Superintendent of Police)గా పదోన్నతి పొందిన ప్రణీత్ రావు, అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, టాలీవుడ్ నటులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్ చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డేటాను హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందు, ప్రణీత్ రావు ఈ హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి, వాటిని మూసీ నదిలోకి విసిరేశారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు.