27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ప్రసాద్ ఆశయాలను కొనసాగించాలి

08-06-2026 10:05 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రసాద్ కృషి చేశారని పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు అన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పాలకుర్తి ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని ములకలపల్లి మండలంలోని పొగళ్ళపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తాటి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి ప్రసాద్ సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.