8 June, 2026 | 11:12 PM

యూరియా కోసం రైతుల బారులు

08-06-2026 10:07 PM

యూరియా లభించకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన రైతులు 

యాప్ లో నమోదు చేసిన లభించని యూరియా

నమోదు చేసుకున్న రైతులందరికీ యూరియా అందజేస్తామని రైతులకు హామీ

శాంతించిన రైతులు

కామారెడ్డి,(విజయక్రాంతి): యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మా జి వాడి చౌరస్తాలోని విండో కార్యాలయంలో రైతుల యూరియా కోసం సోమవారం ఉదయం తరలివచ్చారు. రైతులకు సరిపడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. యాప్ లో నమోదు చేసుకున్న రైతులకు కూడా సరిపడా యూరియా అందుబాటులో ఉండకపోవడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆరోపించారు. సదాశివ నగర్ మండలంలోని సదాశివ నగర్, అడ్లూరు ఎల్లారెడ్డి, పద్మా జి వాడి చౌరస్తా లాలోని విండో కార్యాల యాల వద్ద రైతులు యూరియా కోసం ఉదయం నుంచి క్యూలో నిలబడ్డారు.

క్యూలో నిలబడిన రైతులందరికీ యూరియా లభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి అడ్లూరు ఎల్లారెడ్డి సింగిల్ విండో వద్దకు వచ్చి ఈ యాప్ లో నమోదు చేసుకున్న రైతులకు యూరియా సరఫరా చేసిన తర్వాతే ఇతర రైతులకు అందజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కొందరి రైతులకు  యాప్ లో నమోదు చేసుకో వడం రాదని అలాంటి రైతులకు విండో కార్యాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారని రైతుల ఆందోళన చెందవద్దని విండో చైర్మన్ సదాశివరెడ్డి రైతులకు  నచ్చ చెప్పారు. యూరియా అందరి రైతులకు రెండు మూడు రోజుల్లో అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.