డిప్యూటీ ఈవోగా ప్రతాప్ నవీన్ బాధ్యతల స్వీకారం
10-07-2026 12:00 AM
వేములవాడ, జూలై 9, (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రతాప్ నవీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపింది.






