ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
10-07-2026 12:00 AM
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్) కార్యక్రమంలో భాగంగా గురువారం బూత్ స్థాయి అధికారులు (బిఎల్ వోలు), బూత్ స్థాయి ఏజెంట్లు (బిఎల్‌ఏలు) హైదరాబాద్లోని రామ్నగర్లో ఉన్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి విచ్చేసి సర్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియ కోసం అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆయన కు అధికారికంగా అందజేశారు.






