2 April, 2026 | 5:10 AM

నిజామాబాద్ ఆర్‌బీవీఆర్‌ఆర్ సొసైటీ అధ్యక్షుడిగా ప్రవీణ్‌రెడ్డి

17-06-2025 01:22 AM

నిజామా బాద్, జూన్ 16:( విజయ క్రాంతి) నిజామాబాద్ ఆర్ బి వి ఆర్ ఆర్ సొసైటీ ఎన్నికలలో  ప్రవీణ్ రెడ్డి  అధ్యక్షులుగా విజయం సాధించారు వెంకట రమణారెడ్డి ( రఘు ) కార్యదర్శిగా, భూపతి రెడ్డి ఉపాధ్యక్షులు  ( ఆలంబన ), ఉపాధ్యక్షులు 2( స్కూల్ )  జగత్ రెడ్డి, ఉపాధ్యక్షులు 3 ( స్కూల్ హాస్టల్ ) అమర్ జీత్ రెడ్డి, ఉపాధ్యక్షులు 4  ( ఉమెన్స్ వెల్ఫేర్ )  స్వరూప, కోశాధికారిగా  సాయా రెడ్డి, సహాయ కార్యదర్శిగా  సుజిత్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులుగా పలువురు ఎన్నికయ్యారని సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల అధికారులైన చంద్రసేన్ రెడ్డి, మామిళ్ల సాయ రెడ్డి, కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి  మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థల అభివృద్ధికి తన సర్వ శక్తుల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.