6 April, 2026 | 8:21 PM

అరెస్టులకు భయపడేది లేదు

06-04-2026 06:32 PM

మండల బీఆర్ఎస్ నాయకులు 

సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా నాయకుల ముందస్తు అరెస్ట్ 

కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ తోపాటు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్, మండల పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మాజీ సర్పంచ్ జీ బాబు, దత్తాత్రి లను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఎన్ని లారీలు మాట్లాడుతూ... 6 గ్యారంటీలు, 420 హామీలను బుట్ట దాఖలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇప్పుడు ప్రజలలో తిరగమంటే ప్రశ్నించేవారు ఉన్నారు.

భయపడుతున్నారని ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే 420 హామీలను అమలుచేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిని ముందస్తు అరెస్టులకు పాల్పడి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం  ఎంతవరకు సమంజసం అని అన్నారు. ప్రస్తుత తరుణంలో మక్క రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక విలవిల్లాడుతున్నారని వెంటనే మక్కా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.