6 April, 2026 | 8:21 PM

పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం

06-04-2026 06:35 PM

మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి

కోదాడ: స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డిలు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు రాయపూడి వెంకటనారాయణ సౌజన్యంతో వారి తల్లిదండ్రులు రాయపూడి నాగేశ్వరరావు, ఉదయలక్ష్మి, కూతురు హిమబిందు ల జ్ఞాపకార్థం యశోద హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.

మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న అనారోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కూతురు జ్ఞాపకం వచ్చి బాధపడుతున్న రాయపూడి వెంకటనారాయణ ను మున్సిపల్ చైర్ పర్సన్, డిఎస్పీలు ఓదార్చి ధైర్యం కల్పించారు.

ఈ శిబిరంలో దాదాపు 400 మందికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డీ ఎకో మరియు థైరాయిడ్ పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ, రాజశేఖర్, స్థానిక కౌన్సిలర్ మాలోత్ చైతన్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ, హరిప్రసాద్,సైదా నాయక్, సభ్యులు కాలంగి వెంకటేశ్వర్లు, బుజ్జయ్, జగనీ ప్రసాద్, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, సాయి, హెచ్ఎం నిగిడాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.