11 August, 2026 | 3:46 AM

జిల్లాలో ప్రీ ప్రైమరీ సక్సెస్

11-08-2026 01:18 AM
  1. టార్గెట్‌కు నుంచి పిల్లల అడ్మీషన్లు 
  2. ప్రోత్సాహం అందిస్తున్న ఉపాధ్యాయులు, దాతలు

నిర్మల్ ,ఆగస్టు 10 ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య టార్గెట్ కు మించి చేరింది. ని ర్మల్ జిల్లాలో గత సంవత్సరం 14 ప్రీ ప్రై మరీ పాఠశాలలను ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం మరో 74 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. నిర్మల్ జి ల్లాలో మొత్తం 18 మండలాలు 400 గ్రామపంచాయతీలు మూడు మున్సిపాలిటీలు ఉండగా ఆయా ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలను ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించింది.

జిల్లాలో మొత్తం 599 ప్రాథమిక పాఠశాల లు ఉండగా పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ప్రవేశాలను కల్పిస్తున్నారు. అయితే ఎల్కేజీ యూకేజీ చదువులకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చే ర్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ పాఠశాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభోత్స వం చేసింది. 20 మంది విద్యార్థులు అడ్మిష న్లు తీసుకునేలా ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేసి ఒక ఇన్స్పెక్టర్ ఒక ఆయా తరగతి గదిని మౌలిక సదుపాయాల కింద ఏర్పాటు చేశారు. 

జిల్లాలో జోరుగా ప్రవేశాలు 

జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన ఫ్రీ ప్రై మరీ పాఠశాలలో జిల్లా వ్యాప్తం గా అన్ని ప్రాంతాల్లో ప్రవేశ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు విద్యాశాఖ అధికారి భోజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 74 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో 1609 మంది విద్యార్థులను చేర్పించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

అయి తే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్కేజీ యూకేజీ చదివించాలన్న ఉద్దేశంతో చిన్న పిల్లలను ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూ పారు 19 30 మంది విద్యార్థులు ఇప్పటికే పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్యా బోధన చేసేందుకు ప్రభు త్వం ప్రతి పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుని నియమిం చింది. ఆటపాటలతో కూడిన విద్యలు చిన్నారి విద్యార్థులకు అందజేస్తున్నారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఆయా గ్రా మాల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలపై విస్తృతంగా అవగాహన కల్పించిన ప్రభుత్వ ఉపా ధ్యాయులు సర్పంచులు ఎంపీటీసీలు విద్యావేత్తలు గ్రామాల్లో తిరిగి పిల్లలను పాఠశా లలో చేర్పించేందుకు కృషి చేశారు. పాఠశాలలు చేరిన పిల్లలకు ఆ గ్రామంలో గల ఉపా ధ్యాయులు ప్రధానోపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించి పుస్తకాలు డ్రస్సులు స్టడీ మెటీరియల్స్ బ్యాగ్స్ బూట్లు ఇతర వస్తువులను ఉచితంగా అందించి ప్ర భుత్వ విద్యపై ఆసక్తి పెంచేలా చేపట్టిన చర్య లు ప్రీ ప్రైమరీ పాఠశాలలో మంచి ఫలితా లు ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

కుంటాల మండలంలోని అంద కూర్ గ్రా మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మానాయి సిద్ధిరాం సార్ ఒక్కొక్క విద్యార్థిక 564 రూపాయలు కట్ చేసి స్కూ ల్ కిట్ అందించారు. రాజుర గ్రామంలో మ రో విద్యార్థి రాజేశ్వర్ ఒక్కొక్క పాఠశాల వి ద్యార్థికి 200 విలువచేసే వస్తువులను బహుమతిగా అందించారు. సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదివే పూర్వ విద్యార్థులకు కావల సిన మౌలికస్ రూపాయలకు ఆర్థిక చేయూ త అందిస్తున్నారు.

ప్రవేట్ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ చదివే విద్యార్థులు ఇప్పుడు ఫీజుల భారాన్ని మోయలేక ప్రభుత్వ బడు ల్లో చేర్పించడం వల్ల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పిల్లలకు మంచి చదువు వస్తుందని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సర ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యార్థులు వెళ్లకుండా ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించే విధంగా దూదపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొం టున్నారు.

ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో ఒకటో తరగతిలో చదివే అవకాశం ఉండడంతో ప్రాథమిక ప విద్య పూర్తి అయ్యేవరకు చదువుకునే అవకాశం ఉండడంతో ఇబ్బంది ఉండదని చెప్తు న్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జి ల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు.