2 May, 2026 | 2:42 AM

ఎండ తీవ్రతకు జాగ్రత్తలు తీసుకోవాలి

02-05-2026 01:44 AM

పెదవేడు సర్పంచ్ వెంకటేశ్వర్లు

మఠంపల్లి, మే 1: ఉపాధి కూలీలు వడదెబ్బ నుంచి కాపాడుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పెదవీడు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు సూచించారు. గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉప సర్పంచ్ మల్ రెడ్డి త్రివేణి కోటి రెడ్డితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు పనులను తొందరగా ప్రారంభించాలన్నారు. అ లాగే కూలీలు నీటిని ఎక్కువగా తాగాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఫీల్ అసిస్టెంట్ బి చ్చు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.