వేధింపులు తాళలేక గర్భిణి ఆత్మహత్య
అల్లా దుర్గం, జూన్ 26 : అనుమానం ఆ దంపతుల పాలిట పెనుభూతమైంది. భర్త వేధింపులు భరించలేని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపురం గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.. వివరాల్లోకెళ్తే బంధువుల, పోలీసుల కథనం ప్రకారం, గడిపేద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల అభిలాష్ కు సుస్మిత( 23) తో ఒకటిన్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
కొన్నాళ్లు గడిచిన తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడని వారు తెలిపారు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అయినా అనుమాన భూతంతో డిఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని భర్త, అత్త వేధింపులు ఎక్కువ అవడంతో జీవితంపై విరక్తి చెంది వేధింపులు తాళలేక గురువారం రాత్రి సుస్మిత ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు మృతికి భర్త, అత్త శశిరేఖ కారణమని మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శంకర్ వివరించారు.






