27 June, 2026 | 2:43 AM

మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం..

27-06-2026 01:47 AM

మాజీ విప్ అరెపల్లి మోహన్

కరీంనగర్ జూన్28 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మండిపడ్డారు.

గురువారం నగరంలోని కెమిస్ట్ భవన్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, ఆర్ జిపిఎస్ రాష్ట్ర కోకన్వీనర్ ఉప్పుల అంజన్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎన్.ఎస్.యు ఐ రాష్ట్ర నాయకులు పోతారం సురేందర్ తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు అవినతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

శ్రీధర్ బాబు గారిపై చేసిన ఆరోపణలపై మీ వద్ద సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలి. అవినీతిని రుజువు చేసినట్లయితే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని, నిరూపించినట్లయితే జీవన్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటారా ఆరెపల్లి మోహన్ సవాల్ విసిరినారు. ధైర్యం ఉంటే 2016 నుండి మంథని ప్రాంతంలో ఇసుక దందా ఎవరు ప్రారంభించారో రుజువు చేయాలని అన్నారు, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు.. శ్రీధర్ బాబు నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు జీవన్ రెడ్డి గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలి అని పేర్కొన్నారు.

వామన్ రావు దంపతుల హత్య ఉదంతం మంథనిలో శాంతి భద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులు జీవన్ రెడ్డి తెలియదా అని ప్రశ్నించారు.బిఆర్‌ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్కు మాత్రమే ఎందుకు కిపరిమితం చేశారు? రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు? దీని గురించి బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరు అని మండిపడ్డారు.గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా? రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. మా కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరని హెచ్చరిచారు.