28 March, 2026 | 8:12 PM

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

28-03-2026 06:05 PM

సర్పంచ్ అరుణా దేశ్ పాండు నాయక్ 

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలో కొత్త దొనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో టిచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ నిర్మల హాజరై మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపాలని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజ్యలక్ష్మి,జ్యోతి, ఆశా వర్కర్లు లక్ష్మి,అయా సక్రి తదితరులు పాల్గొన్నారు.