26 May, 2026 | 1:04 PM

Breaking News

గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్   •   సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •  

యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి

24-03-2026 01:05 AM

-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, మార్చి 23 (విజయక్రాంతి): జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, శ్రీ శిశ సంక్షేమ శాఖలు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. యాసంగి (రబీ) లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని స్వీకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెదక్ జిల్లాలో వన మహోత్సవంలో కా ర్యక్రమంలో లక్ష్యంగా మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన బాధ్యత అధికారులది అన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాకు 

31.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 

పటిష్ట కార్యచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. జూలై మొదటి వారంలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలలో ఎక్కడెక్కడ మొక్కలు లభ్యమవుతాయి ఏ ఏ మొక్కలు నాటాల్సి ఉంటుంది అలాగే 2027 టార్గెట్, 2028 లక్ష్యాలను నిర్దేశించుకునివాటిక అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.