10 July, 2026 | 6:41 AM

రాబోయే 20 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి

04-08-2025 12:38 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క                                    

నాగర్ కర్నూల్ ఆగస్టు 3 (విజయక్రాంతి)హైడల్ పవర్ తోబాటు పంపడ్ స్టోరేజ్ తో  పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అందుకోసం రాష్ట్రంలో ఇరవై మూడు పాయింట్స్ ను గుర్తించి వాటి మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల వద్ద జెన్ కో, ట్రాన్స్ కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జూరాల నుంచి పులిచింతల  వరకు కృష్ణా మీద ఉన్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ లను సమీక్ష చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ప్రపంచ పేరుగాంచిన కన్సల్టెంట్  ల సేవలను ఉపయో గించు కోవాలన్నారు.  సోలార్ ద్వారా పగలు జరిగే ఉత్పత్తినీ స్టోరేజ్ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికతను దానికి అవసరమైన స్టోరేజ్ వ్యవస్థను రూపొందించు కోవాలన్నారు.

ముందుచూపుతో అత్యాధునికమైన సాంకేతికతను పరిచయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 1978 లోనే ఆనాటి పాలకులు, ఇంజనీర్లు లోతుగా అధ్యయనం చేసి రివర్స్ పంపింగ్ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్ కు చెందిన తొషిభా, మిస్టుబుషి లాంటి దిగ్గజ సంస్థల సాంకేతికతను ఉపయోగించిన ఆ నాటి పాలకుల ముందు చూపును వారి సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు.

రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హితమైన పవర్ ను ఉత్పత్తి చేసి అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న విద్యుత్తు డి మాండ్ ను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఇరవై ఏళ్లకు సరిపడా విద్యుత్తు డిమాండ్ కు అవసరమైన ఉత్పత్తినీ అందుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా జెన్ కో అధికారులకు ఆదేశాలిచ్చారు.

జెన్ కో అధికారులు, డైరెక్టర్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని రాబోయే పది, ఇరవై ఏళ్ల అవసరాలకు సరిపడ విద్యుత్తు ఉత్పత్తిని అందించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈ సంవత్సరం నిరంతరాయంగా డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్తు ను అందించిన సిబ్బందిని అభినందించారు.

సీఎండీ నుండి కింది సిబ్బంది దాకా వాళ్ళకి అవసరమైన సాంకేతికతను పెంపొందించు కోవడానికి అవసరమైన టెక్ ఎక్స్పోజర్ ఉన్న నిపుణుల ఆధ్వర్యంలో సిలబస్ ట్రైనింగ్ మాడ్యూల్ తాయారు చెయ్యాలని చెప్పారు.గ్రీన్ హైడ్రోజన్, ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ సోలార్ థర్మల్ పవర్, పవన విద్యుత్తు, అణువిద్యుత్తు బ్యాటరీ స్టోరేజ్ లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్తు కోసం వినియోగాన్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసుకోవాలన్నారు.