10 July, 2026 | 5:40 AM

కామారెడ్డి జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ..

04-08-2025 12:38 AM

 కామారెడ్డి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ  పిలుపుమేరకు కామారెడ్డి జిల్లాలో  ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాని  నరేంద్ర మోదీ  పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై కరపత్రాలు, స్టిక్కర్ ల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం అన్ని రకాల సహాయసహకాలు అందిస్తుందన్నారు.   

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతా ల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ద్వారా డబ్బులు జమ చేస్తుందని, ఉపాధి హామీ పథకం కేంద్రం నిధులతో నడుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే సర్పంచ్, మున్సి పల్ ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని కానీ రాష్ట్ర ప్రభు త్వం ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహి ంచక పోవడం వల్ల గ్రామాలకు నిధులు రావడం లేదని అన్నారు.

కామారెడ్డి శాసన సభ్యులు గా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గెలిచిన తర్వాత ఎలాంటి రాజకీయ కక్ష్యలు లేకుండా నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంటింటికి సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. అందుకు మద్దతు తెలిపే వారు 9240015366 నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి బీజేపీని బలపర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీనివాస్, వేణు, రజినీకాంత్, లక్ష్మీపతి, రఘు, రాజగోపాల్, భరత్, ధనలక్ష్మి, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.