04-08-2025 12:37:01 AM
ఎల్లారెడ్డి, ఆగస్టు 3 ( విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బైరం జి కప్ కూలి పని చేసుకుంటూ ఉంటున్నాడు. అంకుల్ క్యాంపులో నివాసముంటున్న అతని కుమారునికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో వారం రోజుల క్రితం అతని భార్య ఇంటికి తాళం వేసి కుమారుడిని చూడడానికి వెళ్ళింది.
ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటి తాళాలు పాలగోట్టబడి ఉన్నట్లు అతని తమ్ముడు శ్రీనివాస్ తన అన్నకు సమాచారం అందించాడు తన కుటుంబ సభ్యులు వచ్చి చూడగా బీరువా తాళాలు పాల్గొనబడి ఉన్నట్లు తెలిపారు బీరువాలో ఉన్న తులం గోల్ చైన్, అర తులం బంగారు ఉంగరం కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.