జోగులాంబకు విలువైన కానుకల అందజేత
రూ.9.27 లక్షల విలువైన బంగారు పూత కవచం విరాళం
అలంపూర్, జూలై 4(విజయక్రాంతి): శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విలువైన కానుకలను సమర్పించారు. ఈ మేరకు శనివారం ఈవో వివరాలను తెలిపారు. శృంగేరి శారదా పీఠం వారు శ్రీజోగుళాంబ అమ్మవారి శ్రీచక్ర అభిషేకం కోసం సుమారు 817 గ్రాముల బరువుగల వెండి కమండలం, అభిషేక పాత్రలను బహుకరించారు.
అలాగే హైదరాబాద్‌కు చెందిన భక్తుడు తీగల క్రాంతి కిరణ్ రెడ్డి అమ్మవారికి రాగి లోహంపై బంగారు పూతతో తయారు చేసిన 13 భాగా ల కవచం (చీర) ను విరాళంగా అందజేశారు. దీని విలువ పన్నులతో కలిపి సుమారు రూ.9.27 లక్షలు ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు. దాత కోరిక మేరకు నిర్ణయించిన రోజున ఈ కవచాన్ని అమ్మవారికి అలంకరించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.






