calender_icon.png 17 February, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతనంగా ఎన్నికైన వారికి పుష్పగుచ్చం అందజేత

16-02-2026 08:33:00 PM

బీసీ మహిళను వరించిన" మిర్యాల " మున్సిపల్ పీఠం

జనరల్ కేటగిరీలో బీసీ మహిళకు అవకాశం

చైర్ పర్సన్ గా చిలుకూరి సుధాబాలు  

వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీషనవీన్ ల ఏకగ్రీవ ఎంపిక.

నియామక పత్రాల అందజేత

పలువురి అభినందనలు

మిర్యాలగూడ,(విజయక్రాంతి): మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవికి నెలకొన్న ఉత్కంఠ కు తెర పడింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వేషన్ కాగా అధికార కాంగ్రెస్ లో ఆ పదవి కొరకు పలువురి ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చి పోటీ వాతావరణం నెలకొంది. మొత్తం 48 వార్డుల్లో  అధికార కాంగ్రెస్ పార్టీ 31 వార్డ్ కౌన్సిలర్ పదవుల ని దక్కించుకోగా మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అధికారి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాలేం పాటి అధ్యక్షతన సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నూతన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం మహోత్సవ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 29వ వార్డు కౌన్సిలర్ జావేద్ గైర్జాజరు కాగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికకు అవసరమైన కోరం కొరకు సభ్యులు లెక్కించగా 31 మంది కౌన్సిలర్ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్)తో కలుపుకొని 32 మంది సభ్యులు హాజరుకాగా ఎన్నిక నిర్మాణకవసరమైన కోరం ఉండడంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నామినేషన్లు ఆహ్వానించగా చైర్మన్ పదవికి 31 వ వార్డు కౌన్సిలర్ చిలుకూరి సుధబాలు ఒక్కరే నామినేషన్ వేయగా ఆమెను 42 వార్డు కౌన్సిలర్ చంద్రకళ ప్రతిపాదించగా 32వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హమీదుద్దీన్ బలపరిచారు.

ఇతర నామినేషన్లు దాఖలు కాకపోవడంతో చిలుకూరి సుధ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నామినేషన్లు ఆహ్వానించగా 41వ వార్డు కౌన్సిలర్ గుడిపాటి శిరీషనవీన్ నామినేషన్ దాఖలు చేయగా ఆమెను పదో వార్డ్ కౌన్సిలర్ తిరుమలగిరి గీత ప్రతిపాదించగా 15వ వార్డు కౌన్సిలర్ శ్రీజ ఆర్క్ బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి గుడిపాటి శిరీషనవీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

అనంతరం చైర్ పర్సన్ గా ఎన్నికైన చిలుకూరు సుధ బాలు, వైస్ చైర్మన్ గా ఎన్నికైన గుడిపాటి శిరీషనవీన్ లకు ప్రత్యేక అధికారి నియామక పత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం వారిని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్ఆర్), ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహశీ ల్దార్ పి.శ్రీనివాస్, మున్సిపల్ డిఈ వెంకన్న, ఆర్ఓ జ్ఞానేశ్వరి, ఈఎంసి బక్కయ్యలు బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.