2 September, 2026 | 1:20 AM

కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన అద్భుతం

02-09-2026 | 12:00am

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళల సాగుతోంది

టిఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అర్ధరహితం

డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కాంగ్రెస్ రాష్ట్ర నేత ఆళ్ల మురళి

చుంచుపల్లి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాజ్యంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా పాలన వచ్చి వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీలో ఉన్న మంత్రి పొంగిలేటి శీను అన్న క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ...  నీళ్లు, నిధులు, నియామకాలు దళిత ముఖ్యమంత్రి, 3ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి అంటూ మాయ మాటలు గాడితో పది సంవత్సరాలు పాటు కుటుంబ పాలన సాగించి రాష్ట్రాన్ని దోచుకుని దాచుకొని రాష్ట్రాన్నిఅప్పుల కుప్పగా  చేసిన ఘన చరిత్ర కేసీఆర్ కుటుంబానదిని తీవ్రంగా విమర్శించారు.

ఈ నేపద్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు 25 లక్షల రైతు కుటుంబాలకు రెండు లక్షల రుణమాఫీ, 12 వేల  రైతు భరోసా, రైతులకు ఉచిత కరెంటు తో పాటు వరి ధాన్యంసన్నాలుకు 500 బోనస్, మహిళ సోదరీమణులకు ఉచిత బస్సు సౌకర్యం, 15 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు,1 కోటి కుటుంబాలకు సన్నబియ్యం, 55 లక్షల కుటుంబాలుకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో పేద విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు, 72,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, 500 కే గ్యాస్ సిలిండర్, కొత్తగా రెండున్నర లక్షల వితంతు ఒంటరి మహిళ దివ్యాంగులకు ఆసరా పెన్షన్స్ మంజూరి, ఇలా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి  ప్రభుత్వమని కొనియాడారు. 

ఈ విలేకరుల సమావేశంలో.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సర్ ప్రోగ్రాం కొత్తగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆళ్ళ మురళి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, కాంగ్రెస్ జిల్లా  అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మంద హనుమంతు, ఎస్కే జానీ పాషా,   తదితరులు పాల్గొన్నారు.