7 June, 2026 | 3:55 PM

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసే గెలుస్తుంది

07-06-2026 02:52 PM

హైదరాబాద్: హైడ్రా ద్వారా రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి భూములపై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నారని, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసే గెలుస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు.