కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాయి
మెట్రో రైలుపై ఆ పార్టీల వైఖరిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి
యాప్‌లో లేని యూరియా షాపులో ఎలా ఉంటుంది?
హుజుర్ నగర్ భి.ఆర్.ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నరసింహారెడ్డి
నేరేడుచర్ల, జూన్ 24: రాష్ట్రలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి ఆడుతున్న కుటిల రాజకీయాలు ప్రజలందరికీ అర్థమయిపోయాయని, మెట్రో రైలుపై ఆ పార్టీల వైఖరిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అని, రెండు కలిసి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాయని, హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు.
బుధవారం నాడు నేరేడుచర్ల మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ... తెలంగాణకి ఆదాయం వచ్చే వనరులన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దానధర్మాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గతంలో కంటే ఎక్కువ వడ్లు కొనుగోలు చేశామంటూ భజన చేసుకుంటున్నాడని, కానీ గతంతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు శాతం తగ్గి, కేవలం 59 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
యాప్ లో లేని యూరియా షాపులో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. యూరియాను సుమారు కట్టకి 300 నుంచి 400 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుందని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కే ఎల్ ఎన్ రెడ్డి,, సురేష్ బాబు,చెన్నబోయిన సైదులు,మాజీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు,మాజీ డీసీసీబీ డైరెక్టర్, మున్సిపల్ కౌన్సిలర్ అప్పిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్లు కడియం వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.






