గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి
అయిజ, జూన్ 24 : అయిజ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కార్తీక్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలకమైన సేవలు అందిస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు అందకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
కుటుంబ పోసెన, పిల్లల చదువులు,వైద్య ఖర్చులు మొదలగు మౌలిక అంశాల సమస్యలు కుటుంబంలో నిర్వహించాలంటే కష్టతరమవుతుందని, అందుకే కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రతినెల సకాలంలో వేతనాలు అందే విధంగా ఎంపీడీవో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య, పి డి ఎస్ యు కార్యదర్శి వెంకటేష్,కిరణ్ కుమార్,సవారన్న,చాంద్ భాష గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.






