24 June, 2026 | 10:31 AM

నాగిరెడ్డిపేట్ బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

24-06-2026 09:48 AM

నాగిరెడ్డిపేట్,జూన్ 24 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలోని బిఆర్ఎస్ నేతలు తాడ్వాయి మండల కేంద్రంలో తలపెట్టిన రైతు ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు,నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తాడువాయి మండల కేంద్రంలో భారీ ధర్నాకు బిఆర్ఎస్ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొంటారని పార్టీ నాయకత్వం ప్రకటించింది.అలాగే రైతులు,వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ క్రమంలో నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, నాయకులు వెంకట్ రెడ్డి, వంశీకృష్ణ గౌడ్,మంగలి యాదగిరి మోతే శ్రీనివాస్, మహేందర్,దుర్గాపతి, సాయిలు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.