12 August, 2026 | 8:31 PM

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2026-సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ తెలంగాణ

12-08-2026 07:11 PM

హైదరాబాద్: రౌండ్ టేబుల్ ఇండియా తెలంగాణలోని వివిధ రంగాలలో విశేషంగా రాణించిన అచీవర్స్, ఎమర్జింగ్ వ్యక్తులను సన్మానించేందుకు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 7వ ఎడిషన్ను గర్వంగా ప్రకటిస్తోంది. ఈ అవార్డులు మన సమాజ అభివృద్ధికి గణనీయంగా దోహదపడిన వ్యక్తులను మరియు సంస్థలను గౌరవిస్తుంది.

2026 అవార్డుల విభాగాలు:

ఈ సంవత్సరం, అవార్డులు 15 విభాగాలలో ఇవ్వబడతాయి: కళలు మరియు సంస్కృతి, ఎన్జీవో, స్టార్ ఉమన్, స్టార్ కిడ్, వినోదం, విద్య, స్టార్ట్-అప్, హెల్త్ కేర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, రిటైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్లుయెన్సర్ , సస్టైనబిలిటీ ఎక్సెలెన్స్, పరిపాలన సేవలు మరియు క్రీడలు. పైన పేర్కొన్న రంగాలలో విజయం పొంది మరియు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఒక అచీవర్ మరియు ఒక ఎమర్జింగ్ వ్యక్తిని సన్మానిస్తారు.

నామినేషన్ మరియు ఓటింగ్ ప్రక్రియ:

గత ఎడిషన్ 2000 నామినేషన్లు మరియు 1,50,000 పబ్లిక్ ఓట్లతో విజయవంతమైన చరిత్రను సాధించిన తరువాత, ఈ

సంవత్సరపు నామినేషన్లు కోసం 13 ఆగస్టు నుండి 27 ఆగస్టు 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2026 జ్యూరీ:

ఈ సంవత్సరం అవార్డుల ప్రదానం చెయ్యడం కోసం గౌరవనీయమైన జ్యూరీ సభ్యుల ప్యానెల్ను కలిగి ఉండడం మాకు

గర్వకారణం:

  1. లక్ష్మీ నంబియార్, స్థాపకులు, సృష్టి ఆర్ట్ గ్యాలరీ
  2. ముజ్తబా హసన్ అస్కరీ, వ్యవస్థాపకులు & మేనేజింగ్ ట్రస్టీ,
  3. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్.
  4. పి.రఘురామ్, స్థాపకులు, కిమ్స్-ఉషాలక్ష్మి హాస్పిటల్
  5. రాజ్ కందుకూరి, జాతీయ అవార్డు గ్రహీత,సినీ నిర్మాత, దర్శకులు మరియు పంపిణీదారు.
  6. ఎం. వి. రమణ, ముఖ్య కార్యనిర్వహణాధికారి, డా. రెడ్డీస్ ల్యాబ్స్.
  7. రమేష్ కాజ, కంట్రీ హెడ్- ఇండియా, ఎల్పిఎల్ ఫైనాన్షియల్ హైదరాబాద్.
  8. సందీప్ సుల్తానియ, ఆర్థిక కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం.
  9. షాహ్ అజీమ్ హమీద్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఫెయిర్మౌంట్ బిల్డర్స్.
  10. శ్రీవిద్య రెడ్డి గుణంపల్లి, ఉపాధ్యక్షులు, జిఎన్ఐటిఎస్ (GNITS)
  11. శ్రీనివాస రావు మహంకాళి, అడ్జంట్ ప్రొఫెసర్, ఎఎస్సిఐ (ASCI) అడ్వైసర్: ఐఐఎల్ఎం ఢిల్లీ, ఎస్ఐయు, తిరుపతి
  12. పొసీడెక్స్ టెక్నాలజీస్, హైదరాబాద్ అభైరో క్యాపిటల్ బోవర్ స్కూల్ ఆఫ్ ఎంట్రిప్రెన్యూర్షిప్.

మా స్పాన్సర్లు:

మా ప్రధాన స్పాన్సర్లకు మనఃపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము- టైటిల్ స్పాన్సర్: ఫెయిర్మౌంట్ బిల్డర్స్,

పవర్డ్ - బై స్పాన్సర్: ఎస్ ఎ ఎస్ ఇన్ఫ్రా , కో - స్పాన్సర్లు : నీమన్స్, శ్రీ జగదాంబ పర్ల్స్, బిగ్ ఎఫ్ఎమ్, నోవొటెల్, మినార్ ఆటా.


రౌండ్ టేబుల్ ఇండియా - విద్య పట్ల నిబద్ధత:

రౌండ్ టేబుల్ ఇండియా 2025 ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ద్వారా నిధులు సమకూర్చి 4 కొత్త స్కూల్ బ్లాక్లను తెలంగాణలో ప్రారంభించింది.

అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

* MPPS మేకగూడలో 6 తరగతి గదులు

* MPPS మౌలాలి లో 3 తరగతి గదులు

* MPPS అల్వాల్ లో 2 తరగతి గదులు

* MPPS నర్సాపూర్ లో 4 తరగతి గదులు

రౌండ్ టేబుల్ ఇండియా 1997 నుండి 4,108 పాఠశాలలలో 10,668 తరగతి గదులను నిర్మాణం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం 11.70 మిలియన్ పిల్లల విద్యకు దోహదపడుతోంది.

గ్రాండ్ అవార్డ్స్ నైట్:

రౌండ్ టేబుల్ ఇండియా అవార్డుల వేడుక 03 అక్టోబర్ 2026న షెడ్యూల్ చేయబడింది. ఈ వేడుక తెలంగాణ రాష్ట్రం ప్రతిభను సన్మానించే మరియు గుర్తించే వేడుక.

నామినేషన్కు ఆహ్వానం:

తెలంగాణ రాష్ట్ర నివాసులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు, పాల్గొనేవారు తమను తాము లేదా ఇతరులను www.prideoftelangana.com లేదా info@prideoftelangana.com కు ఇమెయిల్ ద్వారా తమ ఎంట్రీలను సమర్పించవచ్చు. ఈ వేదిక అర్హులైన వ్యక్తుల కఠిన పరిశ్రమ మరియు విజయాలను గుర్తించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్నిస్తుంది. రౌండ్ టేబుల్ ఇండియా తన కార్యక్రమాల ద్వారా విద్యను ప్రోత్సహించడానికి మరియు సమాజ సేవ చేయడానికి తన నిబద్ధతను కొనసాగిస్తుంది, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డులు మన రాష్ట్రం లోని ప్రతిభ, అంకితభావాన్ని గుర్తించే కీలక వేదిక.

రౌండ్ టేబుల్ ఇండియా గురించిన పరిచయం:

1927లో ఇంగ్లాండ్లోని నార్విచ్లో స్థాపించబడిన రౌండ్ టేబుల్, 52 దేశాలలో 43,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో ఒక గ్లోబల్ ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్గా వృద్ధి చెందింది. భారతదేశంలో 1957 నుండి రౌండ్ టేబుల్ యాక్టివ్గా ఉంది. 320 కంటే ఎక్కువ టేబుల్స్ 4,600+ సభ్యులతో జీరో- ఓవర్హెడ్ పాలసీకి పేరుగాంచింది. సేకరించిన అన్ని నిధులు దాతృత్వ లక్ష్యాల కోసం ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలల నిర్మాణంపై వెచ్చించేలా RTI దృష్టి సారిస్తుంది.