calender_icon.png 10 February, 2026 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తుకు ప్రాథమిక విద్యే కీలకం

10-02-2026 12:25:02 AM

నల్లగొండ జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ 

మర్రిగూడ ఫిబ్రవరి 9 : ప్రతి ఒక్కరి జీవితానికి ప్రాథమిక విద్య అత్యంత కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా పిల్లలతో  మాట్లాడి చదువు, పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అక్షరాలు, సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు.

తదుపరి అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, పోషణాహార వివరాలు దైనందిన హాజరు పరిస్థితి తదితర అంశాలపై అంగన్వాడి ఆయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ  పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య ఎంతో కీలకమని వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొద్దిసేపు పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆనందముగా గడిపారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో మున్నయ్య, సిపిడిఓ సక్కుబాయి, మునుగోడు సిడిపీవో అంగన్వాడి టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు.