02-02-2026 12:00:00 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ మహిళా మ్యూజిక్ చైర్ పోటీలు చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ పాల్గొన్నారు. సెమీ ఫైనల్స్ లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రా బాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, గేమ్స్ ఇన్చార్జి బద్రినారాయణ, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నేతలు శ్రీకాంత్, దామోదర్, పి. నర్సింగ్ రావు, మహమూద్, బాల స్వామి శ్రీనివాస్, ఆనంద్ రావు, లక్ష్మణ్ యాదవ్, చిర్ర యాదగిరి, విజయ లక్ష్మి, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనుష తదితరులు పాల్గొన్నారు.