calender_icon.png 2 February, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన గుండె శస్త్రచికిత్సలకు నిలయం యశోద

02-02-2026 12:00:00 AM

యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్

హనుమకొండ, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్ లో అరుదైన గుండె శస్త్ర చికిత్సలు చేయడంలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని, యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ అన్నారు. హనుమకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డా.పంకజ్ వినోద్ మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్ మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన పేసెంట్లకు, గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్న వారికి కాంప్లెక్స్ ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆడ్వూనస్డ్ కాంప్లెక్స్ కోరోనరీ యాంజియోప్లాస్ట్ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈ మినిమల్లీ ఇన్వేసివ్, కాథెటర్ ఆధారిత చికిత్సలు ఎంపిక చేసిన పేసెంట్లకు సమర్థవంతమైన ఫలితాలను అందించడమే కాకుండా, త్వరగా కోలుకునేలా చేస్తాయన్నారు.

తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, అడ్వానస్డ్ కోరోనరీ ఆర్టరీ వ్యాధులు ముఖ్యంగా వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేసెంట్లలో హార్ట్ ఫెయిల్యూరకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని, ఇటువంటి పేసెంట్లకు సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని, యశోద హాస్పిటల్స్ వంటి అనుభవజ్ఞులైన కేంద్రాలలో, ఇటువంటి అడ్వాన్స్ కాథెటర్ ఆధారిత చికిత్సలు సురక్షితమైన ప్ర త్యామ్నాయాలుగా మారుతున్నాయన్నారు. ఈ ప్రక్రియలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, ఇమేజింగ్ నిపుణులు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన ’హార్ట్ టీమ్’ ఆధ్వర్యంలో జరిగాయనీ, సిటి.స్కాన్, ఎకోకార్డియోగ్రఫీ ఐవియుఎస్, ఓసిటి వంటి ఇమేజింగ్ పరిక రాల సహాయంతో వాల్వ్ అమరిక, స్టంట్ వేయడం ఖచ్చితత్వంతో నిర్వహించామన్నారు.