19-05-2024 01:28:16 AM
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సుల సౌకర్యం కల్పించడాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతు న్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత ప్రయాణంపై కొందరు చెడు ప్రచారం చేస్తున్నారని.. ఆర్టీసీకి, మెట్రో ప్రయాణానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికి కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త బస్సులు తీసుకొచ్చి పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.