calender_icon.png 11 November, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు పెట్టాం: ఆర్వీ కర్ణన్

11-11-2025 11:24:36 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills by-election)లో ఎన్నికల కోడ్( Election code) ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోద చేశారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్(RV Karnan) వెల్లడించారు. కోడ్ ఉల్లంఘించిన ఎఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామని ఆర్వీ కర్ణన్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ ల వద్ద ఉన్నారని కర్ణన్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో(Jubilee Hills Constituency) పర్యటిస్తున్నారు. సిద్దార్థ నగర్ బూత్-120 వద్ద కాన్వాయ్ తో భట్టి విక్రమార్క కనిపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలా సహకరిస్తారని పోలీసులపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రకారం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు ఓటర్లు 10.02 శాతం పోలింగ్ నమోదు అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.